కేసీఆర్ ఫోకస్..ఆదిలాబాద్‌లో కారు స్వీప్?

-

ఈ సారి ఎన్నికల్లో గెలవడం అనేది కే‌సి‌ఆర్ చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తేనే కే‌సి‌ఆర్ సత్తా ఏంటో తెలుస్తుంది. అలాగే జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా తెలంగాణలో గాని ఓటమి పాలైతే జాతీయ రాజకీయాల్లో రాణించే అవకాశాలు ఉండవు.

అందుకే కే‌సి‌ఆర్ ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాడానికి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో గెలుపు కీలకమని భావిస్తున్నారు. అందుకే ఇటీవల కే‌సి‌ఆర్ ప్రజల్లోనే ఉంటున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో భారీ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కే‌సి‌ఆర్ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ లో కీలక సభ నిర్వహించనున్నారు.  కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్నారు.

నియోజక వర్గానికి 1,100 చొప్పున దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించేందుకు దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారి కోసం 3 లక్షల రూపాయల సహా యం అందించేందుకు అమలు చేస్తున్న ‘గృహ లక్ష్మి’ పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1,658 కోట్ల రూపాయల వ్యయంతో చెన్నూర్‌ నియోజకవర్గం పరిధిలో దాదాపు లక్ష ఎకరాలకు నీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం, మందమర్రి మండలంలో సుమారు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేస్తారు. మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావరి నదిపై 164 కోట్లతో నిర్మించనున్న అంతర్‌జిల్లా వంతెన, హాజీపూర్‌ మండలం గుడిపేటలో 205 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వైద్య కళాశాల భవనం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇలా కీలక అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. అంటే మళ్ళీ ఉమ్మడి ఆదిలాబాద్ లో సత్తా చాటాలని చెప్పి కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈసారి ఆదిలాబాద్ లో బి‌ఆర్‌ఎస్ వన్ సైడ్ గా గెలవడం కష్టం . ఈ సారి బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బి‌జే‌పిల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version