ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తారో చెప్పిన మోదీ

-

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో ఈడీ  స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలను ఏం చేస్తారో  ప్రధాని వెల్లడించారు. దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని మోదీ ఆరోపించారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతామని, చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తు ను ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version