BREAKING: కవితను ములాఖత్‌లో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్

-

ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అయ్యారు బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అయ్యారు బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్.

RS Praveen Kumar and Balka Suman met Kavita at Mulakat

ఇక ఎమ్మెల్సీ కవితతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్. మరికాసేపట్లో ( మద్యాహ్నం 12 గంట లకు) తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది. అటు ఈడీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version