షమీ మంచి భర్త అయ్యుంటే బాగుండేది : మాజీ భార్య సంచలనం

-

షమీ మంచి భర్త అయ్యుంటే బాగుండేదంటూ తన మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ లో అదరగొడుతున్న షమీపై అతని మాజీ భార్య హసిన్ జవాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అతను ఎంత మంచి ఆటగాడో…. అంతే మంచి భర్తగా, తండ్రిగా ఉంటే బాగుండేది.

Mohammed Shami’s Ex-Wife Hasin Jahan Comments viral

మేమంతా కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. అది అతనికి మరింత గౌరవం తెచ్చిపెట్టి ఉండేది. అతని దురాశ, డర్టీ మైండ్, తప్పుల కారణంగా మేము ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. షమీ డబ్బుతో నిజాల్ని దాచాలని చూస్తున్నాడు’ అని అన్నారు.

కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్.. ఒక బంపర్ ఆఫర్ ను మహమ్మద్ షమీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చాడు. షమీ కుటుంబం నివసించే గ్రామంలో ఒక మినీ స్టేడియం ను నిర్మించడానికి యువజన సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుందట. ఇక గ్రామ అధికారి స్టేడియం కోసం అనువైన స్థలాన్ని కనుగొనగా, డెవెలప్ మెంట్ అధికారి మిగిలిన ఏర్పాట్లను చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్రామంలో బయటపడని సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి యూపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version