తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జోరు సాగిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలతు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ ప్రజల్లోకి కేసీఆర్ భరోసాను తీసుకువెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్తుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్.
కాంగ్రెస్ నేతలకు పదవులపై మోజు తప్ప ప్రజల మీద ప్రేమ ఉండదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. అధికారం దక్కితే… కుంభకోణాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రోడ్ షోలతో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదట పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం నియోజకవర్గానికి చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్ నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు.