రాజ్య సభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ పై ప్రతిపక్ష ఇండియా పార్టీలు అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాయి. రాజ్యసభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ తో సహా విపక్షాలు తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై తగిన చర్చకు అనుమతించడం లేదని, వివాదస్పద చర్చల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం.. జగ్ దీప్ ధన్ ఖడ్ పై అవిశ్వాస తీర్మాణాన్ని సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్ పీ, డీఎంకే పార్టీలకు చెందిన 50కి పైగా సభ్యులు సంతకాలు చేశారు. ఈ నోటీసులను విపక్షాలు మంగళవారం రాజ్యసభ సెక్రటేరియట్ లో అందజేశాయి. ఈ నిర్ణయం బాధ కలిగించినా ధన్ ఖడ్ మితిమీరిన పక్షపాత ధోరణి వల్ల తప్పక నోటీసులు సమర్పించాల్సి వచ్చిందని విపక్ష నేతలు పేర్కొన్నారు.