పుష్ప-2 నిర్మాతలకు బెదిరింపులు.. అవమానించారంటూ..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన మూవీ పుష్ప-2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పై తాజాగా ఓ వివాదం ఏర్పడింది. పుష్ప-2 నిర్మాతలకు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. పుష్ప-2 సినిమాలో షెకావత్ అనే పేరుతో మలయాళ నటుడు పహద్ పాజిల్ పోలీస్ ఆఫీసర్ నటించిన విషయం తెలిసిందే.

పుష్ప-2 మూవీలో షెకావత్ అనే పేరుతో ఉన్న పాత్రను నెగిటివ్ గా చూపించి.. తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారు అంటూ క్షత్రియ కర్ణ సేన లీడర్ రాజ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణి సైనికుల్లారా సిద్ధంగా ఉండండి. పుష్ప-2 నిర్మాతలపై దాడి చేద్దాం అంటూ రాజ్ షెకావత్ పిలుపునిచ్చారు. పుష్ప  సినిమా విడుదలై 3 సంవత్సరాలు అయింది. ఆ సమయంలోనే షెకావత్ పాత్ర వచ్చింది. పార్ట్ 1లోనే షెకావత్ వస్తే.. మూడేల్ల పాటు ఏం చేశారని.. ఇప్పుడు సంచలన విజయం సాధిస్తుందని.. దానికి బ్రేక్ వేయాలని ఏదో కుట్ర చేస్తున్నారని ఫ్యాన్స్ పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version