పరారీలో ఎంపీ ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ

-

కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లౌంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రజ్వల్ను పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణపైన కూడా ఆరోపణలు రావడంతో ఆమెను విచారించేందుకు ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో భవానీ రేవణ్ణ అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం.

రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌నకు సంబంధించిన ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఆమెను విచారించేందుకు సిట్‌ అధికారులు నోటీసులు పంపారు. శనివారం రోజున ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. ఆదివారం ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవాని అక్కడ లేరు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి ఆమె ముందస్తు బెయిల్‌ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అందుకే పరారైనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version