నర్సు యూనిఫామ్‌లో ఆస్పత్రికి వచ్చిన మేయర్

-

మహారాష్ట్రలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే అక్కడ 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బృహన్‌‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిషోరి పెడ్నేకర్ సోమవారం నర్సు యూనిఫామ్‌లో ఆస్పత్రిని సందర్శించి కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిలో ఉత్సాహం నింపారు. బీఎంసీ ఆధ్వర్యంలో నడుపుతున్న బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌కు నేడు ఉదయం వచ్చారు. గతంలో నర్సుగా పనిచేసిన కిషోరి.. హాస్పిటల్ సిబ్బందిని కలిసి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

అయితే తన ఆస్పత్రి పర్యటన సందర్భంగా కిషోరి భౌతిక దూరం పాటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేను గతంలో నర్సుగా పనిచేశాను. ఈ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు. నేనూ వారిలో ఒకరినని నర్సింగ్ సిబ్బందికి దైర్యం చెప్పాడినే ఇలా నర్సు యూనిఫామ్‌లో వచ్చాను. కరోనాను ఎదుర్కోవడంలో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న పోరాటాన్ని ప్రోత్సహించేందుకు ఈ విధంగా చేశాను. ఇవి గడ్డురోజులు. మనమంతా ఒకరికొరు తోడుగా నిలిచి కరోనాపై పోరును కొనసాగించాల్సి ఉంది’ అని

కాగా, కిషోరి తండ్రి ఒక మిల్ వర్కర్‌గా పనిచేశారు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందు ఆమె నర్సుగా పనిచేశారు. 1992లో శివసేన పార్టీలో చేరారు. పశ్చిమ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, సింధుదుర్గ్ జిల్లాల్లో శివసేన కోసం పనిచేశారు. 2002లో తొలి సారి బీఎంసీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012,2017 లలో ఆమె గెలుపొందారు. ఇటీవల 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకడంతో.. ఆమె వారం రోజులపాటు స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. అయితే రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా తేలడంతో.. ఆమె తిరిగి విధులకు హాజరవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version