విజయ్ ఆన్ లైన్ లో కనిపిస్తే 200 కోట్ల పరిస్థితి ఏమవ్వాలి ..?

-

కరోనాతో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని చిత్ర పరిశ్రమలు అయోమయంలో ఉన్నాయి. ఇప్పట్లో షూటింగులు గాని సినిమాల రిలీజ్ లు గాని ఉండేలా కనిపించడం లేదు. ఒకవేళ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేద్దామంకున్న జనాలు ఎంతవరకు థియోటర్స్ కి వస్తారన్నది గ్యారెంటీ లేదు. దాంతో సౌత్ అండ్ నార్త్ చిత్ర పరిశ్రమ మేకర్స్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా సినీపరిశ్రమపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొందరు స్టార్ హీరోలు.. నిర్మాతలు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి ఓ టి టి ప్లాట్ ఫాం లో తమ రిలీజ్ చేసేయడమే తప్ప ఇంకో దారి లేదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ముందు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో సూర్య తన సినిమాల్ని డిజిటల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

 

తన భార్య జ్యోతిక నటించిన తాజా చిత్రం పొన్మగల్ వంధల్ అమెజాన్ లో రిలీజ్ చేసేయాలని సూర్య నిర్ణయించుకున్నారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ .. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా థియేటర్ యజమానులు ఈ విషయంపై చాలా పట్టుదలగా ఉన్నారట. అందుకే ఇకపై సూర్య సినిమాల్ని థియేట్రికల్ రిలీజ్ చేయనీయమని సంక్రతాలు పంపుతున్నారట. అయితే 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాని మే ఫస్ట్ వీక్ లో విడుదల చేయడానికి సూర్య నిర్ణయించుకున్నట్టు కోలీవుడ్ మీడియా తాజా సమాచారం.

ఇక ‘దళపతి’ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం మాస్టర్. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ కూడా అయింది. కాని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విజయ్ తన మాస్టర్ సినిమాని కూడా అమెజాన్ లో రిలీజ్ చేసేయనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ – విజయ్ సేతుపతి ఆండ్రియా జెరోమీయా- మాలవికా మోహనన్- శాంతను భాగ్యరాజ్ – అర్జున్ దాస్.. నటించారు. అయితే సూర్య.. విజయ్.. విజయ్ సేతుపతి లాంటి అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాల్ని డిజిటల్ రిలీజ్ చేసేందుకు సాహసిస్తున్నారంటే .. థియేట్రికల్ రిలీజ్ పై ఇప్పట్లో నమ్మకం లేదన్న క్లారిటీ వచ్చేస్తోంది. అయితే ఈ సినిమాకి ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ జరిగిన విషయం ఏమిటన్న టాక్ నడుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ కి ఆ డబ్బు తిరిగి ఇలా ఇవ్వనున్నారన్న సందేహాలు కలుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version