ఒడిశాలో విజయంతో 13 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ

-

ఒడిశాలో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కట్టుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. వరుసగా ఐదుసార్లు తిరుగులేని నేతగా ముఖ్యమంత్రి పదవీ చేపట్టి.. ఈసారి కూడా గెలిచి ఆరోసారి విజయం సాధించాలనుకున్న నవీన్ ఆశ నెరవేరలేదు. ఎన్నికల వ్యూహం ఫలితమివ్వలేదు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు, ఒక మాజీ అధికారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయారన్న ఆరోపణలు, ఆయన ఆరోగ్యం బాగాలేదు ఇక పని చేయలేరన్న ప్రధాని మోదీ ప్రచారం నవీన్ పట్నాయక్ పార్టీకి ఓటమి మిగిల్చాయి. నేతగా ఆయన వ్యక్తిగతంగా విజయం సాధించినా అధినేతగా పరాజయం మూటగట్టుకున్నారు. అలా నవీన్​కు చెక్ పెట్టి బీజేపీ ఒడిశాలో పాగా వేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే నిర్వహించిన అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయదళం జయకేతనం ఎగురవేసింది. దీంతో దేశంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 13కు చేరుకుంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు : ఉత్తరాఖండ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, అస్సాం, త్రిపుర, మణిపుర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా (తాజా ఎన్నికల్లో విజయం).

Read more RELATED
Recommended to you

Exit mobile version