కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నయా రికార్డ్

-

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి ఇప్పటికే రికార్డు నెలకొల్పిన నిర్మలమ్మ, ఇప్పుడు ఏడోసారి బడ్జెట్ను సమర్పించి మరో రికార్డు క్రియేట్ చేయనున్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది.

జులై 23న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌-2024 రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సోమవారం రోజున ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి ఒకరోజు ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version