కార్ణాటక రాష్ట్రానికి త్వరలోనే ముఖ్యమంత్రి మారుతున్నారనే వార్త గత కొద్ది రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది. ముఖ్య మంత్రి పదివికి రాజీనామా చేయాలని బీజేపీ అధిష్టానం ఒత్తిడి చేస్తుందని వార్తలు వచ్చాయి. మాజీ సీఎం యడ్యూరప్ప లాగే ప్రస్తుతం సీఎం బసవరాజ్ బొమ్మైని కూడా కొంత కాలం తర్వాత సీఎం పీఠం నుంచి దించుతారని గుస గుసలు వినిపించాయి. అలాగే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్య మంత్రి గా బసవ రాజ్ బొమ్మైకి ఆరోగ్యం సపొర్ట్ చేయడం లేదని.. అతను త్వరలోనే విదేశాల్లో చికిత్స తీసుకుంటాడని కూడా కర్ణాటక మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలన్నీ టికి ముఖ్య మంత్రి బసవరాజ్ బొమ్మై తాజా గా సమాధానం ఇచ్చాడు. తను ముఖ్య మంత్రి పీఠం నుంచి దిగిపోవడం లేదని అన్నారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు. అలాగే తన ఆరోగ్యం కూడా బాగానే ఉందని కూడా అన్నారు. అలాగే తను విదేశాలకు కూడా వెళ్లడం లేదని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రంలో ముఖ్య మంత్రి మార్పు ఉంటుందని వస్తున్న ప్రచారానికి బ్రేకులు పడ్డాయి.