పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న నౌమాన్ ఇలాహి అరెస్ట్ అయ్యాడు. కైరానాకు చెందిన ఐఎస్ఐ కమాండర్ ఇక్బాల్ కానా కోసం గూఢచర్యం చేస్తున్న హర్యానాకు చెందిన నౌమాన్ ఇలాహిని అరెస్ట్ చేశారు స్పెషల్ టాస్క్‌ఫోర్స్. ఐఎస్ఐ శిక్షణ కోసం నౌమాన్ ఇలాహి నాలుగు సార్లు పాకిస్థాన్‌ను సందర్శించినట్లు సమాచారం అందుతోంది.
హర్యానాకు చెందిన దాదాపు 150 మందితో నౌమాన్ ఇలాహి అతి పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు బయటికొస్తున్నాయి నిజాలు. అటు ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు పహల్గామ్‌కు జ్యోతి మల్హోత్రా వెళ్ళింది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడించింది.