రూ.5 లక్షలు కాదు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయారు కేటీఆర్. పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు కాదు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు కేటీఆర్. పాతబస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించి క్షతగాత్రులను ఓదార్చారు కేటీఆర్.

ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్‌లో నీళ్ళు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయాం అని బాధితులు చెప్తున్నారన్నారు కేటీఆర్. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.