అక్టోబర్ 7 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన అక్టోబర్‌ 7వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 52వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది.

అయితే, ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు. మరోవైపు 51వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఆగస్టు 2వ తేదీన జరిగిన విషయం తెలిసిందే.  ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈ మూడింటి పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 07న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే 52వ కౌన్సిల్ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు.  ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా ఈ భేటీ జరుగనుంది.  అక్టోబర్ 01 నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version