రామ్​నాథ్ కోవింద్‌ నేతృత్వంలో.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అంశంపై కమిటీ

-

కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు అవకాశాలను కోవింద్‌ కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీ ఏర్పాటు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

దేశంలో లోక్‌సభ, రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా ఏళ్లుగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలీ ఎన్నికల ‌అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే తాజాగా కేంద్రం.. సెప్టెంబర్ 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై చర్చిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని పరిశీలించాలని కోవింద్‌కు అప్పగించడం పట్ల కేంద్రం ఈ విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బంగాల్‌, బిహార్‌ ముఖ్యమంత్రులు మమత, నీతీశ్‌ వంటి నేతలు ఇప్పటికే జోస్యం చెప్పిన క్రమంలో లోక్‌సభ రద్దుకే కేంద్రం ఈ సమావేశాలను నిర్వహిస్తుందన్న అనుమానం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version