మళ్ళీ టిడిపి అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో..చంద్రబాబుకు బాగా తెలుసు. ఇప్పటికే ఒకసారి అధికారం కోల్పోతే జగన్ దెబ్బకు టిడిపి పరిస్తితి ఏమైందో చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఇంకోసారి ఓడితే..టిడిపి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. అందుకే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి బాబు కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పుడు కొత్తగా బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నారు. సరిగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఏపీలో ఉన్న ప్రతి ఓటరుని కలవడమే టార్గెట్ గా ముందుకెళుతున్నారు. అలాగే టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది..ప్రజల భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అన్నట్లు ప్రచారం చేయనున్నారు. అయితే కార్యక్రమం అనేది బాగానే ఉంది..కానీ బాబుని ఎంతవరకు ప్రజలు నమ్ముతారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే జగన్ ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అలాంటప్పుడు జగన్‌ని మించి బాబు చేయడానికి ఏమి లేదు.
అవే కార్యక్రమాలని వేరే వేరే పేర్లతో చేయాలి. పైగా గతంలో బాబు ఇచ్చిన మాట తప్పుతారనే ప్రచారం ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు ఇలాగే అనేక హామీలు ఇచ్చు..వేటిని పూర్తిగా అమలు చేయలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో బాబు మోసం చేశారు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. ఇంకా పలు హామీలని అమలు చేయలేదు.
అలా మాట తప్పడం వల్లే..2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి హామీలు ఇస్తూ..భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే నమ్మేవారు ఎంతమంది ఉంటారో చెప్పలేం. చూడాలి మరి ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది..బాబుని ప్రజలు నమ్ముతారో లేదో.