ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండ కు… ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా 100 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టి కల్పించింది మోడీ ప్రభుత్వం. టైం చూసి దెబ్బ కొట్టిన మోడీ సర్కార్… ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై ఎదురు దాడి చేసింది.

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు 100 మంది ఉగ్రవాదులు హతం
పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ప్రయోగించిన నరేంద్ర మోడీ సర్కార్… 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అర్ధరాత్రి ఒకటి గంటల 44 నిమిషాలకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేసింది ఇండియన్ ఆర్మీ. ఈ దెబ్బకు వంద మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు.
పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల ధ్వంసం
ఉగ్రవాదులను మట్టి పెట్టిన ఇండియన్ ఆర్మీ…. పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఫోకస్ చేసింది. రావాల్పిండి, ముసఫ్, పర్సుర్, సుక్కుర్ , ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి దాడులు చేసింది. దీంతో ఒక్కరోజు పాటు పాకిస్తాన్ దేశంలో విమానాలు ఎగరకుండా చేసింది ఇండియన్ ఆర్మీ.
పాకిస్తాన్ లో ఆకలి చావులు
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్.. ఇండియాతో యుద్ధం పెట్టుకొని మరింత కష్టాల్లో పడింది. ఇండియాలతో యుద్ధం పెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ దేశానికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ప్రపంచ దేశాలను అప్పు అడగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం ఆ దేశంలో జనాలు అడుక్కునే పరిస్థితి వచ్చింది. అలాగే పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగ్గిపోయాయి. సైనిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. ఇలా అన్ని రంగాలపై.. ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దెబ్బ కొట్టింది.