పార్లమెంట్‌ సిబ్బందికి కొత్త యూనిఫాం.. కమలం గుర్తు ఉండడంతో ప్రతిపక్షాల విమర్శలు

-

ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. 18న పార్లమెంట్‌ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకొని 19 నుంచి కొత్త భవనంలోకి మార్చనున్నారు. నూతన పార్లమెంటు భవనంలోకి వెళ్లే సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించి వెళ్లనున్నట్లు సమాచారం. యూనిఫాంను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ప్రత్యేకంగా రూపొందించింది.

అయితే ఇప్పుడు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల సందర్భంగా సిబ్బంది ధరించనున్న ఈ కొత్త యూనిఫాంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే.. యూనిఫాంపై కమలం పువ్వు గుర్తు ఉండటమే. నెహ్రూ జాకెట్ల మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉండే ఈ యూనిఫాంపై పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉన్నాయని తెలిసింది. ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయని సమాచారం. పార్లమెంటు సిబ్బంది యూనిఫాంపై జాతీయ పుష్పం కమలం బొమ్మ ముద్రిస్తున్నారన్న సమాచారంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు కమలం బొమ్మను కొత్తగా జత చేశారని.. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలిని ఎందుకు ముద్రించలేదని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version