పబ్‌జీకి గట్టిపోటీ మన భారత ఫౌ-జీ గేమ్ యాప్

-

దేశంలో ఓ వ్యసనంగా మారిన పబ్ జీ గేమ్ పై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా స్వదేశీ మల్టీ ప్లేయర్ గేమ్ త్వరలో ఆవిష్కృతమవుతున్న విషయం విషయమే. భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే విదంగా ఈ మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు. మోది పిలుపిచ్చిన ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈ గేమ్ ను తీసుకొస్తున్నట్టు బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు.

Faug

హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబందించిన ఫౌ-జీ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్‌లో టీజర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచే ప్రజలు మరీంత అసక్తిగా ఎదురు చూస్తున్నారు. పబ్ జీ కూడా కార్పొరేషన్ “పబ్‌జీ మొబైల్ ఇండియా” పేరుతో త్వరలో భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే పబ్‌జీకి గట్టిపోటీ ఇవ్వడానికి మన భారత ఫౌ-జీ గేమ్ యాప్ కూడా విడుదలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఫౌ-జీ గేమ్ నవంబర్ తరువాత విడుదల చేస్తామని కంపెనీ గతంలో పేర్కొన్నప్పటికీ, అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారో స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫౌ-జీ గేమ్ అందుబాటులో ఉంటుందని ఎన్‌కోర్‌ గేమ్స్‌ పేర్కొంది. భారత గేమింగ్ కంపెనీ అయిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ పబ్‌జీ పోటీగా గేమ్ ని అభివృద్ధి చేయడానికి అత్యంత నిపుణులైన టాప్ – 25 ప్రోగ్రామర్లు, డిజైనర్స్ , టెస్టర్స్, ఆర్టిస్ట్ బృందాన్ని ఎంపిక చేసినట్లు ఎన్‌కోర్ గతంలో ప్రకటించింది. ‘ఫౌ-జీ: ఫియర్లెస్, యునైటెడ్ గార్డ్స్’ అనే మల్టీ- ప్లేయర్ గేమ్ పబ్‌జీ మొబైల్‌కు భారతీయ ప్రత్యామ్నాయంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు కంపెనీలు కూడా అధికారికంగా గేమ్ ని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియజేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version