ఇండియన్ ఆర్మీ చేస్తున్న దాడులపై పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. మొత్తం తొమ్మిది ప్రాంతాలలో ఇండియా డ్రోన్ దాడి చేసినట్లు సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ పై భారత్ నిన్న రాత్రి ఒక్కరోజే హరూక్ డ్రోన్లతో… దాడి చేసిందని ఆ దేశ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు.

కరాచీ అలాగే సియాల్కోట్ , లాహోర్ సహా తొమ్మిది ప్రాంతాలలో ఇండియా డ్రోన్లతో అటాక్ చేసేందుకు ప్రయత్నించిందని ఆయన వివరించారు. అయితే వాటిని సమర్థవంతంగా తమ ఆర్మీ అడ్డుకుందని కూడా స్పష్టం చేశారు. డ్రోన్ల శిఖరాలను సేకరిస్తున్నామని తెలిపారు. అయితే షరీఫ్ కామెంట్స్ పైన ఇంకా స్పందించలేదు ఇండియా.