అది పాత వీడియో.. పాక్‌ ఆర్మీ భారత వైమానిక హెలికాప్టర్ కూల్చలేదు : పీఐబీ ఫ్యాక్ట్ చెక్

-

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఎటువంటి చర్యలు దిగుతుందో అని భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉగ్రవాదుల మరణాలకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని అటు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజహర్ పేరిట నిన్న ఓ లేఖ విడులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ లోని లాహోర్, కరాచీ మీద డ్రోన్ దాడులు జరిగినట్లు ఆదేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే, పాక్ సోషల్ మీడియాలో మాత్రం ఓ మీడియా తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ ఇండియాకు చెందిన ఎంఐ-17 వీహెచ్5 హెలికాప్టర్ ను ఆపరేషన్ సిందూర్ టైంలో కూల్చిందని దాని సారాంశం. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇండియా తాజాగా క్లారిటీ ఇచ్చింది. సిందూర్ ఆపరేషన్ టైంలో పాక్ ఇండియాకు చెందిన హెలికాప్టర్ లేదా జెట్స్‌ను కూల్చలేదని స్పష్టంచేసింది. అదంతా ఫేక్ ప్రచారం అని.. పాత వీడియో, చిత్రాలను కావాలనే ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news