పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ గందరగోళం.. ఉభయ సభలు వాయిదా

-

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళం తలెత్తింది. ఇటీవల విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ చేసిన భారత్​ ప్రజాస్వామ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలోనూ మొదటి విడతలో జరిగిన సీన్ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ విదేశీ టూర్​పై కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్​సభలో వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మరోవైపు, రాజ్యసభలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దల సభ సైతం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version