కాళేశ్వరం లో 70 వేల కోట్ల అవినీతి జరిగింది : వైఎస్ షర్మిల

-

కాళేశ్వరం లో 70 వేల కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. దీనిపై రేపు ఉదయం ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు షర్మిల. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు షర్మిల.

వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటినే కాళేశ్వరం లెక్కల్లో చూపిస్తున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా 20 వేల కోట్లకు అంచనాలు పెంచడంలో అవినీతి లేదా ? అని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే కనిపించడం లేదా ? అని నిలదీశారు. ఈ ప్రాజెక్టు పై విచారణ చేయాల్సిన అవసరం లేదా ? అని ఆగ్రహించారు. మూడేళ్లకే కాళేశ్వరం మునిగిపోయిందని.. పంప్ హౌస్ ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version