రైతులకు శుభవార్త .. ఆరోజే పీఎం కిసాన్​ 17వ విడత నిధుల విడుదల

-

రైతులకు గుడ్ న్యూస్. కర్షకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి” అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఈ స్కీమ్​ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది.  ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు విడుదల చేసింది.  ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్​ 17వ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ సారి e- kyc పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్​లో జమ అవుతుందనే చర్చ కూడా సాగుతోంది. అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలట.

Read more RELATED
Recommended to you

Exit mobile version