ఉమెన్స్ డే స్పెషల్.. మహిళలకు ప్రధాని మోదీ కానుక

-

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం నారీ శక్తి అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆయన భారతీయ మహిళలకు ఓ శుభవార్త చెప్పారు. కేంద్రం తరఫున ఓ కానుకను అందిస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం వంట గ్యాస్ పైన రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు కాస్త ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. నారీ శక్తికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.300 గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీని వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-2025) వరకు పొడిగించింది. మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పీయూశ్ గోయల్‌ తెలిపారు.  ఈ నెల 31వ తేదీతో సబ్సిడీ గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version