ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, ఆపరేషన్ గంగ పై అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే దాదాపు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులను దాటారు. వీరందరిన హంగేరి, రొమేనియా, పోలాండ్, స్లొవేకియా, మల్టోవా దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల తరలింపుపై అధికారులు ప్రధానికి వివరించనున్నారు.
మరోవైపు గత 24 గంట్లలో 15 విమానాలు భారతీయ విద్యార్థులతో స్వదేశానికి చేరుకున్నాయి. వచ్చే 24 గంటల్లో మరో 13 విమానాల ద్వారా భారతీయులను తరలించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈరోజు 2900 మంది విద్యార్థులు మొత్తంగా ఇప్పటి వరకు 13 వేల మంది విద్యార్థులు స్వదేశానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మరోవైపు ఖార్కీవ్ నుంచి భారతీయులందరినీ తరలించామని.. మరికొన్ని గంటల్లో వారు ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతారని అన్నారు. సుమీలోనే ప్రాబ్లంగా ఉందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక్కడ దాదపు 700 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. సుమీలో రెండు దేశాల మధ్య విపరీతంగా కాల్పులు జరుగుతన్నాయని.. కాల్పుల విరమణ ప్రకటిస్తే తప్పా .. అక్కడ నుంచి భారతీయును తరలించడం కష్టంగా మారింది. కాల్పుల విరమణ కోసం ఉక్రెయిన్, రష్యాలతో ఇండియా సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.