నేడు కోల్‌కతాలో అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ ప్రారంభం

-

భారత్లో మొట్టమొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. నేడు పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో దేశంలోనే తొలి అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హుగ్లీ నది దిగువన మెట్రో రైలు సొరంగ మార్గాన్ని దాదాపు రూ.120 కోట్లతో నిర్మించారు. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్ వరకు ఈ టన్నెల్ను నిర్మించారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్ను 45 సెకన్లలో దాటే మెట్రో రైలు కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఈ సొరంగ మార్గాన్ని నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌కు ఈ టన్నెల్ నిర్మాణం అత్యంత కీలకమని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుండగా ఈ అండర్వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version