మా వల్ల పదేళ్లలో 25కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : మోదీ

-

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పేదల అవసరాలను కాంగ్రెస్​ ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​లో బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి దేశానికి గుర్తింపుగా మారిందని ఆరోపింారు.

‘కొవిడ్​ సమయంలో పేద ప్రజలు ఏమైపోతారోనని అంతా అనుకున్నారు. కానీ నేను వారికి ఉచిత రేషన్, వ్యాక్సిన్​ ఇచ్చాను. మా ప్రభుత్వం కృషి వల్ల 25 కోట్ల మంది దారిద్య్ర రేఖ ఎగువకు వచ్చారు. గత పదేళ్లలో మా ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. కోట్టాది మంది దేశ ప్రజలు, తల్లులు, సోదరీమణులు నాకు రక్షణ కవచం అయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ దోచుకునే లైసెన్సులను నేను రద్దు చేశాను. మా ప్రభుత్వంలో పేదల ఖాతాల్లోకి రూ.34లక్షల కోట్లను వేశాం. ఆ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరింది.’ అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version