ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నాయకులవి: ప్రధాని మోదీ

-

సార్వత్రిక సమరంలో గెలిచి మూడోసారి ప్రధాని కావాలని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అబ్ కీ బార్ 400 పార్ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వరుస ప్రచారాలతో, రోడ్ షోలతో ముందుకు సాగిపోతున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడుతూ.. రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తమ సర్కార్.. దేశ ప్రగతి కోసం కృషి చేసిందని తెలిపారు. కానీ అంతకుముందుదశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ మాత్రం ఓ కుటుంబాన్ని బలోపేతం చేసిందని దుయ్యబట్టారు.

దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు మోదీ. అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ తమ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతమే వాటికే రాజకీయాలతో సంబంధముందని, మిగతా 97శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version