జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రధాన వేదిక భారత్ మండపం అతిథుల రాకతో సందడిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత మండపానికి చేరుకున్నారు. ఆయనకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ ధోబాల్ స్వాగతం పలికారు. సదస్సు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 నుంచి 10.20 మధ్యలో విదేశీ అగ్రనేతలు చేరుకొంటారు. విదేశీ నేతల రాక మొదలవ్వడంతో భారత్ మండపం సందడిగా మారింది. ఈ నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలుకుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా ప్రధానులు, ఐరోపా సమాఖ్య చీఫ్ ఇప్పటికే మండపానికి చేరుకొన్నారు.
జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు భారత్‌కు అగ్రనేతల రాక కొనసాగుతోంది. నేటి ఉదయం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ భారత్ చేరుకొన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి భాను ప్రతాప్ సింగ్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సుల్తాన్ భారత్ చేరుకొన్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు.