బాబు అరెస్ట్: టీడీపీ ఇలా..వైసీపీ అలా.!

-

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ జరిగింది. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ని..తెల్లవారుజామున వెళ్ళిన ఏపీ సి‌ఐ‌డి పోలీసులు బాబుని అదుపులోకి తీసుకున్నారు. అయితే మొదట ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని బాబు..సి‌ఐ‌డి అధికారులతో వాదించారు. అసలు అరెస్టుకు కారణాలు చూపాలని డిమాండ్ చేశారు.

అయితే అరెస్టుకు సంబంధించిన కారణాలు కోర్టుకు సమర్పించామని ఇప్పుడు అరెస్టుకు సహకరించాలని సి‌ఐ‌డి అధికారులు బాబుని కోరారు. దీంతో బాబు అరెస్ట్‌కు సహకరించడం..అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన్ని మంగళగిరిలోని సి‌ఐ‌డి ఆఫీసుకు తీసుకెళ్లి విచారించి..ఆ తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. అలాగే బెయిల్ కోసం బాబు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయం పక్కన పెడితే..బాబు అరెస్ట్ పై టి‌డి‌పి శ్రేణులు భగ్గుమన్నాయి. కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. ఇటు వైసీపీ ఏమో స్కామ్ చేశారు కాబట్టి..చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెబుతున్నారు.

ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ ఇది పూర్తిగా రాజకీయ పరమైన అంశంగా మారిపోయిందనే చెప్పాలి. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. మొదట బాబుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే అంశం ఎక్కువ హైలైట్ అయితే..టి‌డి‌పికి ఫుల్ మైలేజ్ వస్తుంది. బాబుపై సానుభూతి పెరుగుతుంది.

కానీ బాబు తప్పు చేయడం వల్లే అరెస్ట్ అయ్యారనేది వైసీపీ హైలైట్ చేయడానికి చూస్తుంది. అదే సమయంలో బాబు అరెస్ట్ వల్ల టి‌డి‌పి శ్రేణులు నైరాశ్యంలో ఉంటాయి. దెబ్బకు సైలెంట్ అవుతాయనే కోణం. మరి పరిస్తితులు చూస్తుంటే టి‌డి‌పి శ్రేణులు మరింత కసితో పోరాటం చేసేలా ఉన్నాయి. ఇటు వైసీపీ సైతం ధీటుగా బాబు తప్పు చేశారనేది చూపించాలని అనుకుంటున్నారు. ఇక ఎవరేం చేసిన ప్రజలు బాబు అరెస్ట్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version