‘మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్’ జాబితాలో.. నంబర్ వన్​గా మళ్లీ ‘మోదీ’నే

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భారత్​లోనే కాదు ప్రపంచ దేశాల్లో పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాధినేతలు కూడా మోదీని బహిరంగంగా చాలా సార్లు ప్రశంసించారు. ఇక విదేశీయుల మనసులోనూ మోదీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్​గా మోదీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ జాబితాలో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ప్రపంచ నేతల వారంవారీ పాపులారిటీ రేటింగ్స్‌ను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని మోదీ నాయకత్వానికి 76 శాతం మంది ప్రజలు ఆమోదం తెలపగా, 18 శాతం మంది తిరస్కరించారు. సర్వేలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 70 శాతం ఆమోద యోగ్యతతో మోదీ కొద్దికాలంగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇక మోదీ తరువాత స్థానంలో 64 శాతం ఆమోద యోగ్యత, 26 శాతం వ్యతిరేకతతో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌ రెండోస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తదితరులను వారివారి దేశాల్లో ఆమోదించేవారి కంటే తిరస్కరించే వారు ఎక్కువగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version