యూఎస్‌ కాంగ్రెస్​లో ప్రసంగం గురించి ప్రధాని మోదీ ట్వీట్‌

-

అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో తన ప్రసంగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా ట్వీట్ చేశారు. యూఎన్ కాంగ్రెస్ సంయుక్త భేటీలో ప్రసంగించాల్సిందిగా తనను ఆహ్వానించిన స్పీకర్‌ కెవిన్‌ మెకార్థితో పాటు సెనెట్‌లో మెజారిటీ లీడర్‌, రిపబ్లికన్‌, డెమ్రోకటిక్‌ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆహ్వానాన్ని సగౌరవంగా సమ్మతిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

పరస్పర ప్రజాస్వామ్య విలువలు, ప్రజల దృఢమైన  అనుబంధాల మీద నిర్మితమైన భారత్‌-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ఘనమైనదని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం అత్యంత నిబద్ధతతో రెండు దేశాలు దీనికి కట్టుబడి ఉంటాయని అన్నారు. యూఎస్‌ కాంగ్రెస్‌లో మరోసారి ప్రసంగించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 22న ప్రధాని మోదీ యూఎస్‌ కాంగ్రెస్‌ సంయుక్త భేటీలో ప్రసంగిస్తారు. ప్రపంచం ముందున్న సవాళ్లు, వాటినెదుర్కొనడంలో భారత్‌-అమెరికా కృషి, భవిష్యత్తుపై భారత్‌ దార్శనికత తదితరాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version