ఇవాళ వాయనాడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. వాయనాడు లోకసభ స్థానంతో పాటు, మరో 31 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వాయనాడు లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు. ప్రియాంక గాంధీ బరిలో ఉండటంతో అందరి దృష్టిని వాయనాడు ఉప ఎన్నిక ఆకర్షిస్తోంది. గత లోకసభ ఎన్నికల్లో రాయబరేలీ, వాయనాడు స్థానాల్లో గెలుపొంది, వాయనాడు స్థానానికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ.
వాయనాడు లోకసభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైంది ఉప ఎన్నిక. దీంతో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ…గెలుస్తారా అనేది ఆస్తకి గా మారింది. ప్రియాంక గాంధీ తో సహా, వయనాడ్ బరిలో మొత్తం 16 మంది అభ్యర్థులు ఉన్నారు. వాయనాడులో 14 లక్షల మంది ఓటర్లు…ఓటు హక్కు వినియోగించుకొనన్నారు. గత ఎన్నికల్లో వాయనాడు నుంచి 3 లక్షల 64 వేల ఓట్ల మెజారిటీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు రాహుల్ గాంధీ. రాయబరేలీ లోకసభ స్థానంలో సుమారు 4 లక్షల మెజారిటీతో గెలుపొందారు రాహుల్ గాంధీ.