సౌత్ లో ఎలక్షన్ పై ప్రశాంత్ కిశోర్ అంచనా.. తెలంగాణ, ఏపీలో గెలుపెవరిదంటే?

-

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని.. 2024 లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ ఓట్ల వాటాతో పాటు సీట్ల సంఖ్యను కూడా పెంచుకుంటుందని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పీకే.. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందని, ఆయా రాష్ట్రాల్లో కనీసం 100 సీట్లలో బీజేపీ ఓడిపోయేలా చేయగలిగితేనే ఇండియా కూటమికి విజయావకాశాలు పెరుగుతాయని అన్నారు.

ఇక తెలంగాణలో బీజేపీ మొదటి రెండు స్థానాల్లోకి వస్తుందని పీకే తెలిపారు. ఇది చాలా పెద్ద విషయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తిరిగి గెలవడం చాలా కష్టమన్న ప్రశాంత్.. ఒడిశాలో బీజేపీ కచ్చితంగా నంబర్ వన్ అవుతుందని జోస్యం చెప్పారు. ఫలితాలను చూశాక ఆశ్చర్యపోతారని, బంగాల్లో నంబర్ వన్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని చెప్పారు. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకుంటుందని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version