రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. దూరదృష్టి గల వ్యాపారవేత్త రతన్ టాటా, సమాజ హితం కోసం రతన్ టాటా పనిచేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అటు రతన్ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.
మెరుగైన సమాజం కోసం రతన్ టాటా కృషి చేశారని వివరించారు.. పారిశ్రామిక రంగం, దాతృత్వంలో భావితరాలకు రతన్ టాటా ఆదర్శం అన్నారు చంద్రబాబు. రతన్ టాటా మృతి పట్ల రాహుల్ గాంధీ కూడా సంతాపం తెలిపారు.
కాగా కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న 86 ఏళ్ళ రతన్ టాటా… ముంబయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. గతంలో టాటా సన్స్ గ్రూప్స్‌కి చైర్మన్‌గా వ్యవహరించారు రతన్ టాటా. ఇక రతన్ టాటా మరణాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుత టాటా సన్స్ గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్.