ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్టులో పర్యటించనున్నారు. US ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానం మేరకు US పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ పర్యటన న్యూయార్క్ లో ప్రారంభం అవుతుంది.
జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం వాషింగ్టన్ కు వెళ్లనున్న మోదీ జూన్ 24 25 తేదీల్లో ఈజిప్టులో పర్యటిస్తారు. కాగా, దీనికంటే ముందు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి ప్రధానికి ఆతిథ్యమివ్వనున్నారు. అమెరికా పర్యటన నుంచి ప్రధాని నేరుగా ఈజిప్టు వెళ్లనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు.