సామాన్యులకు బిగ్ షాక్…పెరిగిన కందిపప్పు ధరలు

-

సామాన్యులకు బిగ్ షాక్… కందిపప్పు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం కేజీ పప్పు రూ. 160-170 మధ్య పలుకుతోంది. బ్రాండెడ్ అయితే రూ. 180 పైనే ఉంది. రానున్న రోజుల్లో రూ. 200 దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో కందిపప్పు ధర రూ. 110 వరకు ఉండేది. అతివృష్టి, అనావృష్టి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక అటు పంటలు చేతికి రావడంతో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. నెలన్నర క్రితం కేజీ టమాటా రూ. 200 ఉండగా, ఇప్పుడు రైతు బజార్లలో రూ. 15-20కే లభిస్తోంది. పచ్చిమిర్చి కూడా గతంలో కేజీ రూ. 200 వరకు పలకగా, ప్రస్తుతం రూ. 25-30కే అమ్ముతున్నారు. వంకాయ కేజీ రూ. 16, బెండకాయ రూ. 23, బీరకాయ రూ. 18, ఉల్లి రూ. 21, బంగాళాదుంప రూ. 21గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version