అమానుషం.. మహిళను నగ్నంగా ఊరేగించిన భర్త

-

రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు. దానికి అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. అయితే ఆ మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరియావద్ పోలీస్​స్టేషన్​​ పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ ​మీడియాలో వీడియో వైరల్​ కావడం వల్ల శుక్రవారం సాయంత్రం పోలీసులకు తెలిసింది. వెంటనే జిల్లా ఎస్పీతోపాటు పోలీస్​ సిబ్బంది గ్రామానికి చేరుకుని. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలికి ఏడాది కిత్రం వివాహమైందని.. ఆమె గ్రామంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె అత్తమామలు, భర్త గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారని డీజీపీ ఉమేశ్ మిశ్రా తెలిపారు. గురువారం.. ఆమెను కిడ్నాప్​ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లి అత్తమామలు, భర్త ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.  ఈ కేసులో నిందితులందర్నీ అరెస్ట్​ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version