ఖతార్ లో నేవీ అధికారులు విడుదల.. భారత్ కు రిటర్న్

-

ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. 18 నెలలుగా అక్కడి జైల్లో ఉన్న వీరికి విధించిన మరణ దండనను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చింది. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించగా.. ఏడుగురు అధికారులు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

దహ్రా గ్లోబల్ కంపెనీలో పని చేస్తూ ఖతార్‌లో అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చారని, వీరి విడుదలకు వీలుగా ‘ఎమిర్ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌’ తీసుకున్న నిర్ణయాన్ని  అభినందిస్తున్నామన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని భారత్‌కు చేరుకున్న నేవీ మాజీ అధికారులు అన్నారు. ఇవాళ తెల్లవారుజామున దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వారు ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version