మా తప్పులు ఎత్తిచూపడమే తప్ప.. ఇప్పుడేం చేయాలో మోదీ ఆలోచించరు : రాహుల్ గాంధీ

-

ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ అంతా గతంలో తమ వైఫల్యాల గురించి మాట్లాడుతూ నిందించడంపైనే ఉంటుంది కానీ.. దేశ భవిష్యత్​ కోసం ఏం చేయాలనే దానిపై ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ.. భారత భవిష్యత్ గురించి మాట్లాడ్డం తానెప్పుడూ వినలేదని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒడిశా ప్రమాద మృతులకు సంతాపంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. భవిష్యత్‌ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్​ఎస్​ఎస్ లేవని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

“రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్‌ 50 ఏళ్ల క్రితం నిర్మించిందని అంటారు. పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్దాంతం ఎందుకు తొలిగించారంటే కాంగ్రెస్‌ 60 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి అంటారు. కేంద్ర మంత్రులు, ప్రధాని మాటలు వింటే వారు భవిష్యత్‌ గురించి మాట్లాడటంలేదని మీరు గుర్తిస్తారు. వారు గతం గురించే మాట్లాడతారు.” అని రాహుల్​ గాంధీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version