తగ్గేదేలే.. రాయ్‌బరేలీలోనూ ఆధిక్యంలో రాహుల్ గాంధీ

-

18వ లోక్‌సభ ఏర్పాటు కోసం మండుటెండల్లో రెండు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు సాగిస్తున్నారు. ఆయన కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు చోట్ల రాహుల్ హవా కొనసాగుతోంది. తగ్గేదేలే అంటూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీ 26 వేల ఓట్ల ఆధిక్యంలో ముందున్నారు.

మరోవైపు వయనాడ్‌లోనూ ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అమేఠి, వయనాడ్‌ స్థానాల నుంచి పోటీ చేసిన రాహుల్ అమేఠిలో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా ప్రస్తుతం అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ సారి రాహుల్ రెండు స్థానాల్లో విజయం సాధించేలా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version