జోడో యాత్ర ముగింపు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మందిని కలిశాను..ఎంతో తెలుసుకున్నానని.. చిరువ్యాపారులు తమ ఇబ్బందులు, కష్టాలను చెప్పారని వెల్లడించారు. అందరికీ కృతజ్ణతలు. చెప్పేందుకు మాటలు రావడం లేదన్నారు రాహుల్ గాంధీ. ఇది కేవలం ఆరంభం మాత్రమే.
కాంగ్రెస్ పార్టీ ఇంకా పలు బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తుందని.. పాదయాత్ర దక్షిణం నుంచి ఉత్తరం వరకు జరిగినా, దేశవ్యాప్తంగా జోడో యాత్ర ప్రభావం బాగా ఉందని చెప్పగలనని.. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి పట్ల నేను సంతోషంగా లేనన్నారు.
సంతోషంగా ఉన్న వారెవరినీ నా పాదయాత్ర లో నేను చూడలేదని.. నిరుద్యోగం, విద్వేషం ప్రబలిపోతోందని కేంద్రంపై ఫైర్ అయ్యారు. నేను ఏమి చేయగలనో, చేసేందుకు సిధ్ధంగా ఉన్నాను. చాలా స్పష్టంగా ఉన్నానని.. జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణకు నేను చాలా కృతజ్ణతతో ఉన్నానన్నారు. పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రాధమికాంశమన్నారు రాహుల్ గాంధీ.