కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇక ఇవాళ ఉదయం 9.30 గంటలకు తిరిగి ప్రారంభంకానున్న ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు జరుగననున్నాయి. చివరి రోజు మరో మూడు అంశాలు–రైతులు-వ్సవసాయం, సామాజిక న్యాయం-సాధికారత, యువత-విద్య-ఉద్యోగాల పై రూపొందించిన తీర్మానాలను చర్చించి ఆమోదించనున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు.
ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ఉండనుంది. ఉదయం 11 గంటలకు తీర్మానాలపై చర్చ తిరిగి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.50 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముగింపోన్యాసం ఉండనునంది. మధ్యాహ్నం 2.10 గంటలకు జాతీయ గీతం ఆలాపనతో ముగియనున్న మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు రాయపూర్ లోని “జోరా” లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగనుంది.