కరోనా కట్టడిలో మోడీ సిక్స్…. రాహుల్ వెటకారం పీక్స్!

-

ప్రపంచాన్ని వణికించేస్తుంది కోవిడ్-19 కరోనా వైరస్! ఈ కల్లోలం కారణంగా గత ఐదారు నెలలుగా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి.. ఆర్థికంగానూ సమాజం చతికిల పడింది.. జనావళి అతలాకుతలం చెందుతుంది! ఇదే సమయంలో ఇండియాలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ మూడు నెలల పాటు దేశమంతా లాడ్ డౌన్ పెట్టి కరోనా తీవ్రతను కాస్త తగ్గించిందనే చెప్పాలి. ఇక జూన్ నుంచి దేశంలో లాక్ డౌన్ అన్ లాక్ చేయడంతో ఒక్కసారిగా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో… ప్రధాని మోడీపై పై రాహుల్ గాంధీ తనదైన సెటైర్ వేశారు! కోరనా విస్తృతంగా విస్తరిస్తోన్న ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆరు విజయాలు సాధించారంటూ ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో.. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమౌతోందని మొదలుపెట్టిన రాహుల్ల్ల్.. “కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మోదీ సాధించిన విజయాలు ఇవి… అంటూ పేర్కొన్నరు.

1. ఫిబ్రవరి మాసంలో… నమస్తే ట్రంప్.

2. మార్చి మాసంలో… మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూల్చడం.

3. ఏప్రిల్ మాసంలో… ప్రజలతో కొవ్వొత్తులు వెలిగింపజేయడం.

4. మే మాసంలో… ఎన్డీఏ ప్రభుత్వం ఆరవ వార్షికోత్సవం నిర్వహించడం.

5. జూన్ మాసంలో… బిహార్ అసెంబ్లీ ఎన్నికల వర్చువల్ ర్యాలీలు నిర్వహించడం

6. జూలై మాసంలో… రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేయడం వంటివి చేశారంటూ “మోడీ సిక్స్ బాదారు” అని ఎద్దేవా చేశారు.

అంతటితో ఆగకుండా ప్రభుత్వం ఇలా చేస్తుంటే… “ప్రజలు మాత్రం కరోనాపై పోరాటం చేయడంలో తమపై తామే ఆధారపడ్డారు” అంటూ రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. మొత్తానికి రాహుల్ చాలా కాలానికి అధికార పార్టీపై గట్టి సెటైరే వేశారు అంటూ ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version