హనీమూన్ మర్డర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నేను నా భర్తను చంపలేదు, నన్ను కిడ్నాప్ చేశారని నిందితురాలు సోనమ్ ట్విస్ట్ ఇచ్చింది. మేఘాలయలో ఇందౌర్‌లో హనీమూన్‌లో భర్తను హత్య చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన సోనమ్ రఘువంశీ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు వస్తున్నాయి.

ఈ కేసులో తాను నిందితురాలిని కాదని ఆమె పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం అందుతోంది. తనను కిడ్నాప్ చేశారని ఆమె తెలిపినట్లు వెల్లడించాయి పోలీసు వర్గాలు. ఈ కేసులో నేను నిందితురాలిని కాదు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గాజీపుర్లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడినుంచే నేను మావాళ్లకి ఫోన్ చేశా” అని పోలీస్ విచారణలో వెల్లడించిన సోనమ్… ఇప్పుడు నేను నా భర్తను చంపలేదు, నన్ను కిడ్నాప్ చేశారని ట్విస్ట్ ఇచ్చింది.