World Cup 2023 : వరల్డ్ కప్ లో బిగ్ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. సెమీస్ పోరులో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. ముంబై వాంకడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జట్టు ఫామ్ ను బట్టి చూస్తే టీం లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగడం ఖాయం. ఇటు ఆల్ రౌండ్ నైపుణ్యంతో కివీస్ జట్టు గొప్పగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా డబ్ల్యూసి 2019 సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. నేడు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతున్న తరుణంలో.. ఈ మ్యాచ్ కు ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెహ్రామ్, సినీ ప్రముఖులు రజినీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, నీతా అంబానీ, హార్దిక్ పాండ్యా హాజరుకానున్నారు. బీసీసీఐ తరఫున మరికొందరు గెస్టులు కూడా ఈ మ్యాచ్ కు హాజరుకానున్నారు. ఇక అటు ఇండియా వర్స్ న్యూజిల్యాండ్ సెమీ ఫైనల్ చూడటానికి ముంబై బయలుదేరారు రజనీకాంత్.