ఏఆర్ రెహమాన్ సాంగ్ వివాదం.. క్షమాపణలు కోరిన ‘పిప్పా’ టీమ్

-

1971లో జరిగిన ఇండో- పాకిస్థాన్‌ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి భారతదేశం కోసం పోరాడిన కెప్టెన్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ పిప్పా. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ నెల 10న విడుదల అయింది. అయితే తాజాగా ఈ సినిమాలోని కరర్ ఓయి లౌహో కోపట్ అనే పాటపై వివాదం నెలకొంది. బెంగాలీ ప్రముఖ కవి కాజీ నజ్రుల్‌ ఇస్లామ్‌ రాసిన ‘కరర్‌ ఓయి లౌహో కోపట్‌’కు మార్పులు చేసి ‘పిప్పా’ సినిమాలో ఏఆర్ రెహమాన్ వినియోగించారు. అయితే ఈ పాట కీర్తిని దెబ్బతీసేలా మార్పులు చేశారని నజ్రుల్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాటలోని భావాన్ని వక్రీకరించారంటూ ఆ పాట అభిమానులు, నెటిజన్లు కూడా టీమ్​పై తీవ్రంగా ఫైర్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన పిప్పా మూవీ టీమ్.. ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని చెప్పింది. ఒకవేళ ఆ పాట విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరుతూ.. నిర్మాణ సంస్థ రాయ్‌ కపూర్‌ ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన పోస్టు చేసింది. ఆ సాంగ్‌ లిరిక్స్‌కు సంబంధించిన లైసెన్స్‌ అగ్రిమెంట్‌పై కల్యాణి కాజీ (దివంగత) సంతకం చేశారని, అనిర్బన్‌ కాజీ సాక్షిగా ఉన్నారని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version